ఉత్పత్తులు
  • మొక్కజొన్న ఆకులు,కాండం సైలేజీగాను,పేపరు తయారీలోను,ర్యా౦పింగ్,ప్యాకింగ్లోను,ఎండిన తర్వాత మొత్తం మొక్క పంట చెరుకు గాను లేదా సాయిల్ కండీషనర్ గా ఉపయోగపడుతుంది.
  • మొక్క జొన్న ఎ పంట దశలోనైన మేతగాను,పూత దశలో కాయగూరగాను,పాలుపోసుకునే దశలో కాల్చితినే కండేగాను,గింజ ముదిరిన తర్వాత అనేక రకాల పరిశ్రమల్లో ముడిసరుకు గాను వాడబడుతుంది.
  • విత్తనం పశువుల ,కోళ్ళ దాణా,బిస్కట్లు,బేకరి పదార్ధాల తయారీలో వాడబడుతుంది.
  • గింజ నుండ స్టార్చ్,గ్లూకోస్,సుక్రోస్,డెక్త్రీన్స్-సెల్యులోస్,గమ్స్,మొదలైన రసాయన పదార్ధాలు తయారు చేయవచ్చు.
  • మొక్కజొన్న నుండి ఆల్కహాలు,ఇధనాలు లాంటి రసాయన పధార్ధాలు తయారు చేయవచ్చును.
  • మొక్క జొన్న నూనె అనేక దేశాల్లో వంట నూనెగా వాడబడుతుంది.ఇది హృదయసంభందిత రోగులకు మంచిది.ఈ నూనెలో లినోలిక్ మరియు ఒలిక్ ఆమ్లాలు ఎక్కువ,కోలేస్ట్రాల్ తక్కువగా వుంటుంది.
  • కార్న్ ప్లేక్స్,సూప్ మిక్స్,ఇంస్టంట్ కార్నపఫ్స్,ఉప్మామిక్స్,కేసర్ బాత్ మొదలైన అనేక కార లేదా తీపి తిండి పదార్ధాలు తయారుచేయవచ్చు.