లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది.దీని నివారణకు విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి,మరల వారం రోజులకు ఒకసారి 3 గ్రా. కాపర్ అక్సిక్లోరైడ్ లీటరు నీటిలో కలిపి లేదా ఒక శాతం బోరోమిశ్రమంతో పిచికారి చేయాలి.ఎత్తైన నారుమడుల్లో నారును పెంచాలి. విత్తనం వత్తుగా విత్త కూడదు.నారు కుళ్ళు తెగులు కనపడిన వెంటనే తడులను ఆపి వేయాలి.
వాతావరణ౦ మబ్బుగా ఉండి,ముసురు వర్షాలు పడినప్పుడు,ఈ తెగులు ఎక్కువగా కనపడుతుంది.ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి,ఆకులు పండుబారి రాలి పోవడం జరుగుతుంది.దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30గ్రా+ఒక గ్రాము స్త్రేప్తోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆకులపై బూడిదరంగు మచ్చలు ఏర్పడి ,ఆకులు పండుబారి రాలిపోతాయి.దీని నివారణకు మాంకో'జెబ్ 2.5గ్రా లేదా కార్బ౦డజిమ్ 1గ్రా.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
లేత చిగుళ్ళు మాడిపోయి,కొమ్మల కణుపుల వద్ద కుళ్ళు కనపడి కొమ్మలు విరిగి పోతాయి.దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా 0.1గ్రా స్త్రేప్తోసైక్లిన్ లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.
ముదురు కొమ్మల బెరుడు పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.కొమ్మల పై నుండి క్రిందకు ఎందుతాయి.పండుకాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి.దీని నివారణకు కాప్టాన్ 2గ్రా/మాంకోజెబ్ 2.5 గ్రా లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా.లీటరు నీటిలో కలిపి పూతసమయంలో,కాయలు పండు బారే సమయంలో పిచికారి చేయాలి.కిలో విత్తనానికి 3గ్రా కాప్టాన్ లేదా 3గ్రా మాంకోజెబ్ తో విత్తనశుద్ది చేయాలి.కాయకుళ్ళు తెగులు సోకిన మొక్కల నుండి విత్తనం సేకరించరాదు.
మొక్కలు వడలిపోయి,ఎండిపోయి,పూతపిందె,ఆకులు రాలిపోతాయి.దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణ౦తో వడలిపోయిన చెట్ల మొదళ్ళు తడిపి నత్రజని ,నీటి తడులు తగ్గించాలి.
ఆకుల అడుగున తెల్లటి బూడిద కలిగిన మచ్చలు ఏర్పడతాయి.ఆకులు పండుబారి ఆకులు,కాయలు రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3గ్రా.లేదా కెరాథెన్ 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్కలు గిడస బారుతాయి.ఆకులు చిన్నవిగా తయారయి,కుచ్చులుగా మారి,పండు బారుతాయి.పూత ,పిందె ఆగిపోతుంది.పీనట్ బడ్ నెక్రోసిన్ వైరస్ తెగులుకు మందులు లేవు.వైరస్ సోకకుండా జాగ్రత్త వహించాలి.వైరస్ తట్టుకొనే రకాలైన జి-4,యల్.సి.ఎ-235,334 రకాలను సాగు చేసుకోవాలి.పెనుబంక,ఆకు ముడుత పురుగులు సోకకుండా ఫిప్రొనిల్/కార్బోఫ్యురాన్ గుళిక మందులు వాడాలి.వైరస్ సోకిన మొక్కల నుండి విత్తనం సేకరించకూడదు.విచక్షణా రహితంగా ఎరువులు,పురుగు మందులు వాడకూడదు.విత్తనాన్ని లీటరు నీటికి 150 గ్రా.ట్రైసోడియం ఆర్ధోఫస్ఫేటుతో విత్తన శుధ్ధి చేయాలి.చేను చుట్టూ జొన్న,మొక్క జొన్న మొదలైన ఎత్తైన పైరులు పెంచాలి.వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.