పొడవు కాయలు.వర్షాధారపు పైరుకు అనుకూలం.దిగుబడి వర్షాధారంగా ఎకరాకు 6-7.2 క్వి౦టాళ్ళు,నీటి వసతి క్రింద 10-12క్వి౦టాళ్ళు వస్తుంది.
కాయలు సన్నగా,పొడవుగా ఉంటాయి.పచ్చికాయకు,ఎండుకాయకు అనుకూలం.వైరస్ ను తట్టుకొంటుంది.దిగుబడి ఎకరాకు 16-18 క్వింటాళ్ళు.
కాయలు పొట్టిగా,లావుగా ఉంటాయి.నెల్లూరు,చిత్తూరు,శ్రీకాకుళ౦,విశాఖపట్టణ౦ జిల్లాల్లో నీటి వసతి కింద వేయదగిన రకం.త్వరగా కాపు కొస్తుంది.కారం తక్కువ.వేసవి పైరుకు అనుకూలమైన రకం.దిగుబడి ఎకరాకు 20-22 క్వింటాళ్ళు.
కాయలు పొడవుగా ,లావుగా ఉంటాయి పచ్చిమిర్చికి,ఎండుమిర్చికి అనుకూల నీటి వసతి కింద వేయదగిన రకం.త్వరగా కాపుకొస్తుంది.కారం తక్కువ .వేసవి పైరుకు అనుకూలమైన రకం.దిగుబడి ఎకరాకు 20-22 క్వింటాళ్ళు.
పొడవైన కాయలు.తెలంగాణా ప్రాంతంలో నీటి ఆధారపు పై౦ పాగా అనుకూలం.దిగుబడి ఎకరాకు 16-18 క్వింటాళ్ళు.
లావైన,పొడవైన కాయలు.తూర్పు గోదావరి ,శ్రీకాకుళం జిల్లాల్లో నీటి వసతి క్రిందపచ్చి మిర్చి,ఎండుమిర్చిలకు అనుకూలం.దిగుబడి ఎకరాకు 14-16క్వింటాళ్ళు.
కాయలు పొడవు తక్కువ .కారం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో వర్షాదారంగానూ మరియు నీటి వసతి కింద సాగుకు అనుకూలం.వైరస్ ను బాగా తట్టుకొంటుంది.అన్ని జిల్లాలకు అనుకూలం.దిగుబడి ఎకరాకు 22-24 క్వి౦టాళ్ళు.
పొడవైన కాయలు గల రకం.పచ్చి మిర్చికి ,ఎండుమిర్చికి అనుకూలం.వర్షాదారం క్రింద,నీటి వసతి క్రింద సాగుకు అనుకూలమైన జాతీయం రకం.దిగుబడి ఎకరాకు 18-20క్వింటాళ్ళు.
పొడవైన ,లావైన కాయలు కలిగిన రకం.పచ్చి మిర్చికి ,ఎండుమిర్చికి ,నీటి ఆధారపు పైరుకు అనుకూలం.దిగుబడి ఎకరాకు 20-22 క్వింటాళ్ళు.
కాయలు పొడవు కలిగి కారం ఎక్కువగా ఉన్న రకం.అన్ని రకాల కంటే దిగుబడి ఎక్కువ.దిగుబడి ఎకరాకు 24-26క్వింటాళ్ళు.
యల్.సి.ఎ-353: మొక్కల గుబురుగా ,ఒక మాదిరి ఎత్తుగా పెరుగుతాయి.కాయలు 7-9సెం.మీ పొడవుండి,సన్నగా ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి.పచ్చి మరియు ఎండుకాయలకు అనుకూలం.
యల్.సి.ఎ-424: కాయలు 10-12సెం.మీ పొడవుంటాయి.లావు పొడవు తో కూడిన కాయలు .కారం తక్కువ .వరంగల్ లోకల్ కన్నా త్వరగా కోత కొస్తాయి.