మినుము పురుగులు
రసం పిల్చు పురుగులు

పైరు తోలిదశలో అంటే 10-౩౦ రోజులు వరకు వివిధ రకాలైన రస౦ పిల్చే పురుగులు తామర పురుగులు ,పచ్చదోమలు, పేసుబంక మొదలగునవి ఆశి౦చి మొక్కలను పేరగనివ్వకండా చేస్తాయి.


నివారణ

కార్చోసల్ఫాస్తో విత్తన శుద్ధి చేసి పైరును 20 నుండి 25 రోజుల వరకు ఈ పురుగుల బారి నుండి తప్పి౦చవచ్చు,ఎల్.బి.జి-611, 402 లా౦టి రకాలు కా౦డ౦ ఈగ ను తట్టుకు౦టాయి.పేనుబ౦క, వచ్చదోమ ,తామర పురుగు, తెల్లదోమ ,చిత్తపురుగుల నివారణకు ఒక లీటరు నీటికీ 1.5 మి.లీ ఎండోసల్ఫాన్ లేదా 1గ్రా .ఎసి ఫేట్ తో కలిపి పిచికారి చేయాలి.


కా౦డపు ఈగ

ఈ పురుగు క్రిమి దశ కాండంలో చేరి తినటం వలన మొక్క ఎ౦డిపోతుంది.ఎక్కువగాతొలకరి పైరుపై ఆశిస్తు౦ది.నివాణకు మోనోక్రోటోఫాస్ 1.6మి.లి.లేదా ఎసిఫేట్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికరి చేయాలి.


మరుకా మచ్చల పురుగు

ఈ పురుగు మొగ్గ ,పూత ,పిందె దశల్లో ఆశి౦చి ఎక్కువ నష్ట౦ కలుగజేస్తు౦ది.పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటు౦ది.కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు జేర్చి గూడుగా కట్టి ,కాయలకు రంద్ర౦ చేసి లోపలి గింజలను తినట౦వలన పంటకుఎక్కువ నష్టం కలుగుతుంది. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లి .+ డైక్లోర్ వాస్ 1 మి.లీ.లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి.


చిత్త పురుగులు

ఈపురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశి౦చిరంధ్రాలు చెస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారంచకపొతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మి.లి . క్లోరిపైరిఫాస్ లేదా 2.0 మి.లీ.ఏండోసల్ఫాన్ లీటరు నిటకి కలిపి పిచికారి చేయాలి.


తామరపురుగులు

ఈపురుగులు తొలిదశలో లేత ఆకుల పై వృద్ది చెంది రసాన్ని పిలుస్తాయి.వీటి వల్ల ఆకుముడుత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తు౦ది .పంటకు 15-20శాతం నష్టం కలుగుతుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ.లేదా ఎసి ఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


తెల్లదోమ

ఈ పురుగులుఆకుల్లోని రపాన్ని పీలుస్తాయి.అంతే కాక ఎల్లో మొజాయిక్ అనే వైరన్ వ్యాధిని(పల్లాకు తెగులు)కూడా వ్యాపి౦ప చేస్తాయి.వీటినివారణకు 1.6మి.లీ.మోనోక్రోటోఫాస్ లేదా 2మి.లీ.మిథైల్ డెమెటాన్ లేదా డ్రైజోఫాస్ 2.0మి.లీ. లీటరు నీటికి కలిపిపిచికారిచేయాలి.


పోగాకు లద్దె పురుగు

ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్దాన్ని గీరితీనటం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకురంధ్రాలుచేసి,ఆకులను పూర్తీగులు ,పువ్వులను, పి౦దెలను కూడా తింటాయి.ఈ పురుగులు రాత్రి పూట ఎకువగా తింటూ,పగలు మొక్కల మొదళ్ళలోను,భూమి నెర్రెలలో ను చేరుతాయి.


నివారణకు ఈ క్రింద సూచించిన సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటి౦చాలి.

  • గ్రుడ్ల సముదాయలను ఏరివేయాలి.
  • జల్లెడగామారి పిల్లపురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి.
  • ఎకరాకు 30000ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలి వదలాలి.
  • ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్చాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి.
  • ఎకరాకు ఎన్.పి.వి 200 యల్.ఇ ద్రావణన్ని సాయ౦కాల౦లో పిచికారిచేయాలి.
  • పురుగుఉధృతిఅధిక౦గా ఉన్నప్పుడు పొలంలో విషపు "ఎర" ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500మి.లీ .లేదా క్లోరిపైరిఫాస్ 500మి.లీ. లేదా కార్చిరిల్ 50 - 500 గ్రా, 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడె నీటితో కలిపి చిన్న ఉ౦డలుగా చేసి సాయ౦ సమయ౦లో వెధజల్లాలి.
  • చివరిగా ఎ౦డోసల్ఫాస్ 2 మి.లీ మోనోక్రోటోఫాన్ 1.6 మి.లీ. లేదా క్టోరిపైరిఫాస్ 2.5 మి.లీ .లీటరు నీటెలొ కలిపి పిచికారిచేయాలి.

శనగ పచ్చపురుగు

శనగపచ్చపురుగు మొదట ఆకు పై సన్న రంద్రాలు చేసి పత్రహరితాన్ని తి౦టూ 1, 2 రోజులలో విప్పారని మొగ్గలలోనికి చోచ్చుకునిపొయి లోపలి బాగాన్ని తి౦టు౦ది. ఎదిగిన పురుగులు కాయలలోనికీ తల భాగాన్ని చొప్పి౦చి కాయను తొలుస్తూ మిగిలిన శరీరాన్ని కాయ బయట ఉ౦చట౦ ఈ పురుగు ప్రత్యేక లక్షణ౦. ఈ పురుగు ఆశి౦చిన మొక్కలు తక్కువ దిగుబడినిస్తాయి.


నివారణ

పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగి౦జల కషాయాన్ని పిచికారి చెయ్యలి. బాగ ఎదిగిన పురుగులను ఎరి నాశన౦చేయాలి. తప్పనిసరి అయితే ఎండోసల్ఫాస్ 2 మి.లీ లేదా క్టోరిపైరిపాస్ 2.5 మి.లీ. లేదా క్వినాల ఫాస్ 2.0 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 0.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.