ఎరువులు

వర్షాధారపు ప౦టకు ఎకరానికి 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం విత్తనంతో పాటు దుక్కిలో వేసుకోవాలి. నీటి వసతి క్రింద కుసుమను సాగుచేసుకున్నట్లైతే, సిఫారసు చేసిన నత్రజనిలో 50% మరియు పూర్తి భాస్వారాన్ని దుక్కి లో వేసుకోవాలి. మిగతా 50% నత్రజనిని 5 వారాల తర్వాత మొదటి తడి కట్టేటప్పుడు పైపాటుగా వేసుకోవాలి.భాస్వరాన్ని సింగల్ సూవర్ ఫాస్ఫేట్ రూప౦లో వేసినట్లైతే దానిలోని గ౦ధక౦ వలన నునే దిగుబడి పెరిగే అవకాశం వు౦టు౦ది. జీవన ఎరునైవ అజోస్పైరిల్లమ్ 25 గ్రా తో ఒక కిలో విత్తనాన్ని శుద్ది చేసినట్లైతే, ఎకరాకు 8 కిలోల నత్రజనిని ఆదాచేసుకోవచ్చు. 45 కిలోల గలధక మూలకాన్ని సి౦గిల్ సూపర్ ఫాస్ఫేట్ రూప౦లో వేసినట్లయితే అధిక గింజ దిగుబడిని మరియు నూనె శాతాన్ని సాధించవచ్చును. శాఖీయ ఎదుగుదలను అదుపు చేసే హార్మోను అయినటువంటి సైకోసిల్ ను 1000 పి.పి.యం మోతాదులో 50% పూత దశలో పిచికారి చేసుకో వడల వలన అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంది.