కిటకనాశనుల వినియోగ౦లో ర్తెతులు పాటి౦చవలసిన భద్రతాసూచనలు :
- 1.ఆహార పదార్దాలతో బాటుకిటనాశక మందులను రవాణా చేయరాదు.
- 2.కిటకనాశక మందులను తాశ౦ వేసి భద్రపరచ౦డి.
- 3.కిటకనాశక మందులను పిల్లలకు అందకుండా ఉండే చోట నిల్వచేయాలి.
- 4.ఆసల్తేన ప్యాకింగులతోనే కీటకనాశని మందులను కొనండి.
- 5.ఉపయోగించే ముందు లేబులును ,వివరాలపత్రాన్ని పూర్తిగా చదవ౦డి.
- 6.రక్షణ కల్వ౦చే వస్త్తాలను ధరి౦చ౦డి.
- 7.సిఫారను చేసినపరిమాణాన్ని సరిగ్గాకొలిచి తీసుకోండి.
- 8.నీటితో కలిపేటప్పుడు కర్రతో బాగా కలియబెట్ట౦డి.
- 9.మందు చిందకుండా ఉండటానికి గరాటును ఉపయోగి౦చ౦డి.
- 10.కిటకనాశిని మందు డబ్బాలను నీరులేదా ఆహారాన్ని నిల్వచేయడానికి ఉపయోగించకండి.
- 11.గాలి వీచే దిశలోనే పిచికారీ చేయండి.
- 12.నాజల్ ను శుభ్రపరచడానికి నోటితో గాలిని ఊదకండి.
- 13.పిచికారీ చేసేటప్పుడు తీనకండి,త్రాగకండి,పొగ త్రాగకండి.
- 14.చిల్లుపడిన ,పాడయిన స్వ్తేయరును లేదా డస్లరునువాడకండి.
- 15ప్రయాదవశాత్తూ మందు పడితే ,మలినమైన దుస్తులను,శరీరాన్ని నీటిలోశుభ్ర౦ చేసుకోండి.
- 16.పిల్లల చేత పిచికారీ చేయి౦చవద్దు.
- 17.మందు చల్లు తున్న ప్రదేశముల వద్ద ఆహార పదార్దాలను ఉంచవద్దు.
- 18.తినే ము౦దు ,తాగే ముందు చేతులను శుభ్ర౦గా కడుక్కోవాలి.
- 19.ప్రమాదవశాత్తూ విష ప్రభావ౦ కలిగితే,ప్రాధమిక చికిత్స చేసి డాక్లరును సంప్రదించ౦డి.
- 20.డాక్లరుకు కిటకనాశని మందుడబ్బా వివరాల కరపత్రాన్ని చూపించి వెంటనే మంచి వైద్యచికిత్స చేయి౦చ౦డి.
- 21.ఖాళీ డబ్బాలను విరగగొట్టి భూమిలో పాతీపెట్ట౦డి.
- 22.మందు చల్లడంపూర్తయిన తరువాత స్నానం చేయండి,దుస్తులను ఉతకండి.
- 23.పరిసరాలుకలుషితంకాకుండాజాగ్రత్తలు తీసుకో౦డి.
- 24.మందుచల్లిన పోల౦లో హెచ్చరికబోర్డులనుపెట్ట౦డి.