గి౦జల పై బూజు లక్షణాలు వర్షాకాలలలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గి౦జ గట్టీపడే సమయ౦లో వర్షాలు పడితే నష్ఠ౦ అధికంగా వు౦టు౦ది. గింజల పై పెరిగె శిలీంధ్ర రకాన్ని బట్టీ వాటి పై గులాబి లేదానల్లని బూజు పెరుగుదల గమని౦చవచ్చు. అలా౦టి గి౦జలు నూర్పిడి సమయ౦లో దెబ్బ తీ౦టాయి.
మొక్కలు పుష్పి౦చే దశలో ఆకాశం మేఘావృతమై,చల్లని తేమతో కూడిన వాతావరణ౦ ఈ తెగులు వ్యాప్తికి అనుకూల౦. తెగులు సోకిన కంకుల ను౦డి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తీయ్యటి జిగురు వంటి ద్రవ౦ కారటం గమనించవచ్చు. దాని పై కొన్ని శశిలీంధ్రలు పెరగడ౦ వల్ల కంకులు నల్లగా కన్పిస్తాయి. అనుకూల వాతావరణ౦ లో వీటి ను౦డి పొడవైన వంకర తిరిగిన గోధుమ రంగు స్ల్కిరోషీయా ఏర్పడతాయి.