జట్రోఫా కార్కస్ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతానికి చెందిన చిన్నపాటి పోదలాంటి చెట్టు. ఇది విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుంది. మన రాష్ట్రంలో జట్రోఫా తుర్పకనుమలలో సహజసిద్ధంగా కనబడుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గల కొండ ప్రాంతాల్లో విరివిగా కనపడుతాయి.
జట్రోఫా గింజలనుండి తీసిన నునేను కొవ్యోత్తులు, సబ్బులు, వార్నిష్ ల తయారీ పరిశ్రమల్లో వాడతారు. ఈ నూనేను జీవ ఇంధనంగా తయారు చెసినట్లయీతే డీజిల్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిని చర్మరోగాల నివారణకు, రుమాటిజం, పశువుల గాయాల నివారణకు కూడా ఉపయోగిస్తారు. వేళ్ళను పాముకాటుకు మందుగా ఉపయోగిస్తారు.
జట్రోఫా విత్తనాల ద్వరా నూనే తీసిన తర్వాత మిగిలిన చెక్కలో నత్రజని, భాస్వరం, పొటాషియం ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. జట్రోఫా ఆకులను టస్సర్ పట్టు పురుగులకు ఆహారంగా ఉపయోగిస్తారు.
మనరాష్ట్రంలో కానుగ మొక్కలు ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం మరియు చిత్తూరు జిల్లాలో విస్తారంగా వున్నాయి
దీనిని వంట చెరుకుగా ఉపయోగించవచ్చు. కిలో వంట చెఱకు నుండి 4,600 కి. క్యాలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. దీని కలప గట్టిగా వుండటం వల్ల బండి చక్రాలు మరియు ఫర్నిచర్ తయారికి ఉపయోగపడుతుంది. కలప గుజ్జును కాగితం తయారికి, చెట్టు బెరడుతో తాళ్ళు, ఆకులను పశువుల జీర్ణశక్తిని పెంచడానికి మేతగా వాడవచ్చును. వరి, కాఫీ, వక్క, చెఱకు మరియు వివిధ పంటలకు పచ్చిరోట్టలా వేసుకోవచ్చు.