ఎల్.జిజి.407 :

పంటకాలం 65-70 రోజులు ఖరీఫ్,రబీ,వేసవి అనువైనది.దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు మొక్కలు నిటారుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన కాస్తాయి . గింజలు మెరుస్తూ మద్యస్థ లావుగా ఉంటాయి. ఎల్లో మొజాయిక్ , నల్ల ఆకుపచ్చ తెగుళ్ళు ను తట్టు కుంటుంది .

ఎల్.జిజి.450 :

పంటకాలం 65-70 రోజులు ఖరీఫ్,రబీ,మాగాణి లో వరి తర్వాత అనువైనది. దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి గింజలు మెరుస్తూ ఉంటాయి. ఎల్లో మొజాయిక్ తెగుళ్ళు ను తట్టు కుంటుంది. ఒకే సరి కోతకోస్తాయి .

ఎల్.జిజి.410 :

పంటకాలం 65-70 రోజులు ఖరీఫ్,రబీ,వేసవి అనువైనది.దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు మొక్కలు మద్యస్థ ఎత్తులో ఉండి గుబురుగా కనిపిస్తాయి. మొక్క పంటకొచ్చే సమయంలో వర్షాలు కురిసిన కాయల్లో గింజలు కొంతవరకు పాడవకుండా ఉంటాయి.

ఎల్.జిజి.295 :

పంటకాలం 60-65 రోజులు ఖరీఫ్ అనువైనది.దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు. మొక్కలు నిటారుగా పెరుగుతాయి . కాపు మొక్కపై భాగానే ఉండి , గింజ మద్యస్థ లావుగా , సాదాగా వుంటుంది .నల్ల మచ్చ తెగులును తట్టుకుంటుంది . మోవ్వకుళ్ళు తెగులు ను కొంతవరకు తట్టుకుంటుంది.

డబ్ల్యు .జి.జి.2 :

పంటకాలం 65-70 రోజులు ఖరీఫ్,రబీ,వేసవి అనువైనది.దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి . గింజలు మెరుస్తుంటాయి . నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది .

డబ్ల్యు .జి.జి. 37(ఏకశిల) :

పంటకాలం 65-70 రోజులు ఖరీఫ్,రబీ,వేసవి అనువైనది.దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు . గింజలు పచ్చగా మెరుస్తుంటాయి . రాష్ట్రమంతట అన్ని కాలాల్లో పండించటానికి అనుకూలమైనది . ఎల్లో మొజాయిక్ తెగులును తట్టుకుంటుంది . మోవ్వకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.

ఎల్.జిజి.460 :

పంటకాలం 60-65 రోజులు ఖరీఫ్,రబీ,వేసవి అనువైనది.దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు. కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగం లో వుండి కోయడానికి సులువుగా వుంటుంది. ఒకేసారి కొత్త కొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకొంటుంది.మొవ్వ కుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది .

యం.యల్ 267 :

పంటకాలం 65 రోజులు ఖరీఫ్,రబీ,వేసవి అనువైనది.దిగుబడి ఎకరాకు 4-5 క్వింటాళ్ళు . రాష్ట్రమంతట అన్ని కాలాల్లో పండించటానికి అనుకూలమైనది. మొక్క నితరుగ పెరుగుతుంది. క్రింద నుండి పై దాక కాపు కాస్తుంది.కయ గుతులకున్న కాడ మరియు గింజలు అన్ని చిన్నవిగా ఉంటాయి .

పూసా-105 :

పంటకాలం 65-70 రోజులు ఖరీఫ్,రబీ,వేసవి మాగాణి లో వరి తర్వాత అనువైనది.దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది . మొక్క పై భాగానే వుంటుంది. ఒకేసారి కోతకోస్తుంది. గింజలు మద్యస్థ లావుగా పచ్చగా మెరుస్తుంటాయి .ఎల్లోమోజయిక్ , ఆకుమచ్చ తేగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది.