శ్రీవరిసాగు

1. శ్రీ వరి సాగు పద్ధతి

2.సాధారణ పద్ధతికి - శ్రీ పద్ధతికి ఉన్న వ్యత్యాసాలు

అంశం సాధారణ పద్ధతి శ్రీ పద్ధతి
విత్తన౦ ఒక ఎకరానికి 50 నుండి 60కిలోల విత్తన౦ అవసరం. ఒక ఎకరానికి కేవలం 2 కిలోల విత్తనం సరిపోతుంది.
నాటే విధానం 30 రోజుల వయసు ఉన్న నారుని ఉపయోగిస్తారు. 8 నుండి 12 రోజుల వయసు ఉన్న( రెండాకు దశ) నారు ఉపయోగిస్తారు.
ఒక్కో కుదురులో ఉండే మొక్కల సంఖ్య సాధారణంగా ఒక్కో కుదురులో 3 నుండి 4 మొక్కలు చాల లోతుగా నాటుతారు. ఒక్కో కుదురులో ఒకే మొక్కను అతి జాగ్రత్తగా నాటుతారు.
ఎరువుల/పురుగుమందుల వాడకం రసాయనక ఎరువులు,పురుగు మందులు,ఇతర కలుపు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ పద్దతిలో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇస్తారు.సాధారణంగా పురుగు మందులు,ఇతర క్రిమి సంహారక మందులు అవసరం ఉండదు,సాంప్రదాయ సేంద్రియ మందులు వాడవచ్చును.
నీటి యాజమాన్యం నీటిని ఎల్లప్పుడూ నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది పొలం తడిచేల ఉండేటట్లు చేస్తే సరిపోతుంది
కలుపు యాజమాన్యం కూలీలతో కలుపు మొక్కలు తీయించి గట్టుపైన వేస్తారు.కొందరు కలుపు బెడద ఎక్కువగా ఉంటే రసాయానాలు వాడతారు రసాయనాలు వాడకుండా కలుపు నివారిస్తారు.వీడర్ అనే పరికారాన్ని ఉపయోగించటం ద్వారా కలుపు మొక్కలు నేలలో కలిసిన ఈ కలుపు పచ్చి రోట్టలా ఉపయోగిపడుతుంది.