agriculture ap

*మొవ్వకుళ్ళు తెగులు(బడ్ నెక్రొసిస్ వైరస్ తెగులు)

ఇది వైరస్ తెగులు,తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.

లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి.ముదురు ఆకుల్లో ఈ లక్షణాలు కనిపించవు.

లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు కురుచబడి,ఎక్కువ రెమ్మలు వస్తాయి.ఆకులు చిన్నవిగా అయి లేత ఆకుపచ్చ మచ్చలు కల్గి పాలిపోయి ఉంటాయి. 15రోజుల తర్వాత తెగులు ఆశిస్తే మొవ్వు ఎండిపోయి,కుళ్ళిపోతుంది.క్రమంగా మొక్క అంతా ఎండిపోతుంది.

వేర్లు,ఊడలు,కాయల మీద మచ్చలు ఏర్పడి కుల్లిపోతాయి.ఈ తెగులు సోకిన మొక్కలనుండి వచ్చిన వేరుశనగ విత్తనాలు చిన్నవిగా ఉండి,ముడుచుకొని ఉంటాయి.

నివారణకు తెగులును కొంతవరకు తట్టుకునే కదిరి-3,ఆర్ 8808,వేమన,ఐ.సి.జి.యస్-రకాలను సాగుచేయాలి.

వేరుశనగతో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.

విత్తిన 20రోజుల తర్వాతతామర పురుగుల(త్రిప్స్)వ్యాప్తి అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ.లేక డైమిధోయేట్ 2మి.లి.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

agriculture ap

ఎర్లి తిక్కా ఆకుమచ్చ తెగులు

త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు కొంచం గుండ్రంగా వుండి,ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కల్గి వుంటాయి.

ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా,గుండ్రంగా వుండి,ఆకు అడుగు భాగాన నల్లని రంగు కల్గి వు౦టాయి.కాండం మీద,ఆకు కాడల మీద,ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి.

వేరుశనగలో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.

నివారణకు తెగులును తట్టుకునే రకాలను(వేమన,జె.సి.జి-88 సాగుచేయాలి.

తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మా౦కోజెబ్ 400గ్రా.లేదా కార్బ౦డజిమ్ 200గ్రా.లేదా క్లోరోథలోనిల్ 400గ్రా.లేదా హెక్సాకొనాజోల్ 400 మి.లీ చొప్పున 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.తాయి.

agriculture ap

*కా౦డం కుళ్ళు వైరస్ తెగులు(స్టెమ్ నేక్రొసిస్ వైరస్ తెగులు)

-టొబాకొ స్ట్స్ట్రీక్ వైరస్ ఈ తెగులను కలగచేస్తుంది.

ఈ తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు చనిపోతుంది,క్రమేణ కాండం అంతా నల్లగా మారి మొక్క చనిపోతుంది.కాయలు,ఊడలు నల్లగా మారి కుళ్ళిపోతాయి.

ఈ వైరస్ వేరుశనగ లేని సమయంలో గట్ల పైన వున్న కలుపు మొక్కలపై జీవిస్తుంది.కలుపు మొక్కల్లో ముఖ్యంగా వయ్యారిభామ(కా౦గ్రెస్ గడ్డి),ఉత్తరేణి,ఎన్నెద్దులాకు,కుక్కముళ్ళు మరియు గరిటికమ్మ పువ్వుల్లోని పుప్పొడి రేణువుల్లో వుంటుంది.

ఈ పుప్పొడి రేణువులు,తామర పురుగుల ద్వారా ఇంకా గాలి ద్వారా వేరుశనగ ఆకులపై పడి తామర పురుగులు ఆకుపై గోకినప్పుడు ఈ పుప్పొడి రేణువుల్లోని వైరస్ కణాలు మొక్కలోనికి ప్రవేశించి కాండం కుళ్ళు కలుగచేస్తాయి.

తెగులు ఆశి౦చడంవలన ప్రారంభ దశలో మొక్క మొదలులో వున్న శాఖలు పసుపు వర్ణానికి మారి ఎండిపోతాయి. తరువాత కా౦డం,కొమ్మలపైన తెల్లటి బూజు తెరలుగా ఏర్పడతాయి.ఈ తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంవున్న స్క్లీరోషియాలు ఏర్పడతాయి.ఊడలు,కాయలు కూడా ఈ తెగులుకు లోనవుతాయి.కాయలోని గి౦జల పై నీలి బూడిదరంగు మచ్చలు ఏర్పడతాయి.

ఈ తెగులు ఆశించిన మొక్కలను పీకినప్పుడు నేలపై వున్న మొక్క భాగాలు మాత్రం వూడివస్తాయి.వేరు,కాయలు నేలలోనే వు౦డిపోతాయి. సజ్జ,జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.

కిలో విత్తనాలకు 1గ్రాము కార్బ౦డజిమ్ లేదా 3గ్రా.ల కాఫ్టాన్ కలిపి విత్తన శుధ్ధి చేయాలి.

రెండు కిలోల ట్రైకోడెర్మావిరిడె ఫార్ములేషన్ 50కిలోల పశువుల ఎరువుతో కలిపి నీరుచల్లి,పోలిథీన్ కాగితంతో కప్పి 15 రోజుల తర్వాత ఒక ఎకరా భూమిలో విత్తేముందు చల్లాలి.

agriculture ap

తిక్కా ఆకుమచ్చ తెగులు

త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు కొంచం గుండ్రంగా వుండి,ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కల్గి వుంటాయి.

ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా,గుండ్రంగా వుండి,ఆకు అడుగు భాగాన నల్లని రంగు కల్గి వు౦టాయి.కాండం మీద,ఆకు కాడల మీద,ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి.

వేరుశనగలో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.

నివారణకు తెగులును తట్టుకునే రకాలను(వేమన,జె.సి.జి-88)సాగుచేయాలి.

తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మా౦కోజెబ్ 400గ్రా.లేదా కార్బ౦డజిమ్ 200గ్రా.లేదా క్లోరోథలోనిల్ 400గ్రా.లేదా హెక్సాకొనాజోల్ 400 మి.లీ చొప్పున 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

agriculture ap

తుప్పు లేక కుంకుమ తెగులు్

-ఆకుల అడుగు భాగంలో ఎరుపు-ఇటుక రంగు గల చిన్న పొక్కులు ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కన్పిస్తాయి.

తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ పొక్కులు పూల మీద తప్ప మొక్క మిగతా అన్ని భాగాల మీద కన్పిస్తాయి.

ఈ తెగులు రబీలో ఉధృతంగా ఆశిస్తుంది.

నివారణకు లీటరు నీటికి 2గ్రా.క్లోరోథలోనిల్ లేక 2గ్రా.ట్రైడిమార్ప్ లేదా 2గ్రా.మా౦కోజెబ్ కలిపి మొక్కలు తడిచే విధంగా పిచికారి చేయాలి.