1.విత్తే సమయం :

ఖరీఫ్ : జూన్ - జూలై; వేసవి : జనవరి.

2.విత్తన మోతాదు :

మంచి దిగుబడుల కోసం రైతులు హెక్టారుకు 4 కిలోల విత్తనం లేదా ఎకరాకు 1.6 కిలోలు వాడటం మంచిది.

3.విత్తన శుద్ధి :

సజ్జ పండించే రైతులకు వెర్రి కంకి తెగులు ప్రధాన సమస్య దీనిని అధిగమించడానికి విత్తన శుద్ది అవసరం . 2 % (20 గ్రా/లీ) ఉప్పునీటి ద్రావణంలో విత్తనాలను 10 ని||లు ఉంచటం ద్వారా ఎర్గట్ శిలింద్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన కిలో విత్తనానికి 3 గ్రాముల తైరంను లేదా 2 గ్రాముల మేతలక్సిల్ మందు కలుపుకోవాలి . మందు విత్తనానికి సమంగా పట్టేలా చేయాలి . విత్తన శుద్ధి వల్ల మొక్కలు ఆరిగ్యంగా పెరుగుతాయి .


4.విత్తే దూరం :

వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కల మధ్య 12 నుండి 15 సెం.మీ. దూరం ఉండేట్లు గోర్రుతో విత్తుకోవాలి .


5.నాటటం :

నారుపోసి 15 రోజుల వయసుగల నారు మొక్కలను పైన తెల్పిన దూరంలో నాటవచ్చు .ఎకరాకు 58,000 - 72,000 మొక్కలు ఉంచాలి .