నేలలు మరియు నేల తయారి

నీరు ఇంకే మురుగునీటి వసతి గల భూములు సజ్జ సాగుకు అనుకూలం .సజ్జ అధికంగా పండిస్తున్న విశాఖ ,మహబూబ్నగర్,నల్గొండ, ప్రకాశం జిల్లాల రైతులు తేలికపాటి నుండి మధ్యరకం భూములను ఎన్నుకోవాలి .మంచి దిగుబడి కోసం హెక్టారుకు 10 టన్నుల పశువుల ఎరువు చివరి దుక్కి లో వేసి కలియదున్నాలి. ఆ తరవాత రెండు , మూడు సార్లు గొర్రు గుంటకను తొలి కలుపు లేకుండా చూసుకోవాలి. తొలకరి జల్లు పడిన తరవాత దుక్కుని బాగా లోతుగా దున్నాలి.ఇలా లోతుగా దున్నటం ద్వారా భుమిపోరాల్లో ఉన్నటువంటి లార్వా పైకి రావటం ద్వారా సుర్యరస్మికి చనిపోయి ఆ విధంగా మనంకొంత చీడపీడలను నాశనం చేసుకోవచ్చు.తర్వాత రెండు,మూడు సార్లు గొర్రు గుంటకలు నడిపి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.