ఎరువులు:

ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.ఎకరాకు నీటి పారుదల పంటకు 32కి.+16కి.+12కి., వర్షాధారపు పంటకు 24కి.+12కి.+8కి., వంతున నత్రజని+భాస్వరం+పోటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజనిని విత్తేటప్పుడు సగం, విత్తిన 30 రోజులకు మరోసగం వేయాలి.