ప్రొద్దుతిరుగుడు - నేలలు

నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర ,చల్కా ,ఇసుక ,రేగడి మరియు ఒండ్రనేలలు దీని సాగుకు శ్రేష్టం.ఉదజని సూచిక 6.5నుండి 8.0ఉన్న నేలలు ఈ పంతక్లు చాల అనువైనవి.ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల్లో కంటె కొద్దిగా క్షార లక్షణాలు గల నేలల్లో బాగా పండుతుంది.ఆమ్ల లక్షణాలు ప్రొద్దుతిరుగుడు యొక్క మొలకెత్తు స్వబావాన్ని,మొక్క పెరుగుదలను, నూనె శాతాన్ని మరియు మొక్కల పటుత్వాన్ని తగ్గించి దిగుబడి తక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కావున లోతట్టు మరియు సముద్ర ధీర ప్రాంతాల్లో సాగు చేయరాదు. తేమ ఎక్కువ కాలం నిల్వఉంచుకోగల నల్ల రేగడి నేలల్లో రబీ,వేసవి మరియు వసంత కాలపు పంటలు వేసుకోవచ్చు.

నేల తయారి

భూమిని నాలుగైదు సార్లు భాగాదున్ని మెత్తటి దుక్కిని తయారు చేయాలి. మధ్యస్థ మరియు భారువు నేలలైతే బ్లేడుతో ఒకటి రెండు సార్లు కలియదున్ని,తరువాత చదును చేసి అ తర్వాత భోదేలు వేసి విత్తనం వేసుకోవచ్చు.ఇలా బోదెలు వేయటం వాళ్ళ విత్తనాన్ని నాటేందుకు మరియు 30 నుంచి 35 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో ఎరువులు పై పాటుగా వేయటానికి వీలుగా ఉంటుంది.