నీటి యాజమాన్యం

ప్రత్తి పంటకు 500మి.మీ నీరు అవసరమౌతుంది,పంట వేసిన 75 నుండి 120 రోజుల మధ్య బెట్ట లేకుండా చూడాలి.దీని కోసం ఆయా ప్రాంతాలలోని వర్షాలు కురిసే సరళిని బతి విత్తే సమయమును మార్పు చేసుకోవాలి.ప్రత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కనుక నీరు ఎక్కువగా పెట్టరాదు.భూమిలో వున్న తేమను బట్టి 20-25 రోజులకొకసారి నీరు పెట్టాలి.సామాన్యంగా ఎరువులు వేసిన వెంటనే మరియు పూతసమయంలో,కాయ' తయారగు సమయంలో నీరు పెట్టాలి.ఖరీఫ్ లో 2-3 తడులు,రబీ లో ఆరు తడులు అవసరం ఉంటుంది.నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలం పోదిగించరాదు.