నువ్వులు ఎరువులు

ఖరీఫ్ లో అఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజిని ,16 కిలోల పొటాష్ , 24 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. రబీ లేదా వేసవిలో వీటితోపాటు 8 కిలోల నత్రజనిని అదన౦గా వేసుకోవాలి. నత్రజని సగ భాగ౦ ,భాస్వరం మరియు పోటాష్ నిచ్చే ఎరువులను అఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి.మిగతా సగ భాగ౦ నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేయాలి. భాస్వరం ఎరువును సి౦గిల్ సూపర్ పాస్ఫేట్ రూప౦లో వాడిసప్పుడు అదన౦గా కాల్షియ౦, గ౦ధక౦ లభి౦చి దిగుబడి పెరుగుతు౦ది.