పైముడుత(త్రిప్పు):

రెక్కల పురుగులు ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చటం వాళ్ళ ఆకుల అంచులు పైకి ముడుచు కుంటాయి.ఆకులు,పిందెలు రాగి రంగులోకి మారి పూత ,పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు కార్బరిల్ 3 గ్రా లేదా ఫాసలోన్ 3 మి,లీ లేదా స్పైనోసార్ 0.25మి.లీ లీటరు నీటికి కలిపి ఆకు అడుగు భాగం బాగా తడిచేల పిచికారి చేయాలి.నాటిన 15 మరియు 45 వ రోజు ఫిప్రొనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8కిలోలు చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముదతను నివారించుకోవచ్చు.ముందు జాగ్రత్త చర్య గా ఇమిడా క్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి.రసాయన,సే౦ద్రియపు ఎరువుల సమతుల్యత పాటించాలి.పై ముడుతతో పాటు క్రింద ముడుత (తెల్ల నల్లి)కూడా ఉంటే కార్బరిల్ మరియు ఎసిఫేట్ మందులు వాడ కూడదు.

క్రింద ముడుత(తెల్ల నల్లి):

తెల్ల నల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చటం వలన ఆకులు క్రిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి.ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి.మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్ద కడతాయి.దీని నివారణకు డైకోఫాల్ 5మి.లీ లేదా నీళ్ళలో కరిగే గంధకం 3గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. సింథటిక్ పైరిత్రాయిడ్ ,మందులు వాడరాదు.నత్రజని ఎరువులు తగ్గించాలి.

పెను బంక:

పెనుబంక లేత కొమ్మల ,ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చటం వలన పెరుగుదల తగ్గుతుంది.తియ్యటి పదార్ధాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది.ఆకులు ,కాయలు నల్లటి నల్లటి మసిపూసి నట్లుగా మారిపోతాయి. దీని నివారణకు మిథైల్ డేమెటాన్ 2మి.లీ లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయతొలుచు పురుగు (పొగాకు లద్దె పురుగు ,శనగ పచ్చ పురుగు ,పచ్చ్చ రబ్బరు పురుగు):

లద్దె పురుగులు మొదటి దశ లో ఆకులను నష్ట పరచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినివేస్తాయి.పంటకు విపరీథమైన నష్టం వాటిల్లుతుంది.
నివారణ:

  • 1.థయోడికార్బ్ 1గ్రా.లేదా ఎసిఫేట్ 1.5 గ్రా లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ లేదా స్పైనోసిడ్ 0.25 మీ.లీ లేదా క్వినాల్ఫాస్ 2.0 మీ.లీ లీటరు నీటికి కలిపి అవసరంమేరకు పిచికారి చేయాలి.
  • 2.సమగ్ర సస్య రక్షణ అవలంబించాలి.
  • 3.పెరుగుదల నియంత్రణ కారులు నవల్యురాన్ 0.75 మీ.లీ లీటరు నీటికి లేదాడైఫ్లూబెంజురాన్ 1గ్రా(లీటరు నీటికి) లాంటి మందులతో గ్రుడ్లనుండి అపుడే బయటకు వచ్చే పిల్ల పురుగులను అరికట్టవచ్చు.
  • 4.విషపు ఏరా ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను నివారించవచ్చు.దీనిని 5కిలోల తవుడు ,500 గ్రా .కార్బరిల్ లేదా 500 మీ.లీ క్లోరిపైరిఫాస్ ను 500 గ్రాముల బెల్లంతో తగినంత నీటిని కలిపి తయారు చేయాలి.ఈ విధంగా తయారు చేసిన చిన్న చిన్న గుళికలను సాయంత్రం చేనులో సమానంగా చల్లితే నెర్రెలలో దాగి ఉన్న పురుగులను రాత్రులందు బయటకు వచ్చి తినటం వలన చనిపోతాయి.
  • 5.వేసవిలో నిద్రావస్థ లో ఉన్న పురుగుల బయట పడేలా లోతు దుక్కులు దున్నాలి.
  • 6.కాయతొలుచు పురుగుల ఉధృతి ,ఉనికిని గుర్తించడానికి ఎకరానికి కనీసం 4 లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.ఎరాలను మాత్రం 25 రోజుల కొకసారి మార్చాలి.
  • 7.విచక్షణా రహితంగా పురుగు మందులు వాడరాదు.ఆకర్షణ పైర్లుగా ఆముదం,బంతి మొక్కలు చేలలో వేసుకోవాలి.
  • 8.జీవనియంత్రణ ద్వారా శనగ పచ్చ పురుగు నివారణకు హెచ్.ఎన్.ఫై.వి.ని. పొగాకు లద్దె పురుగు నివారణకు ఎస్.ఎన్.ఫై.వి.ని వాడాలి.
  • 9.మరిన్ని వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించండి.