కలుపు నివారణ:
కలుపు నివారణ మరియు అంతరకృషి

మెట్ట మినుములో విత్తుటకు ము౦దు ప్లూక్టోరాలిస్ 45% ద్రావకం ఎకరాకు 1 లీటరు చొప్పన భూమి పై పిచికారి చేసి గుంటకతో పై పైన కలియదున్నాలి లేదా పె౦డిమిథాలిస్ 30% ద్రావకం ఎకరాకు 1.3 ను౦డి 1.6 లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గోర్రుతో అ౦తరకృషీ చేయాలి. మాగాణి మినుములో ఊద, చిప్పెర, గరిక లా౦టి గడ్డి జాతీ మొక్కల నిర్మూలనకు ఫెనాక్సోపాప్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మి-లి- లేదా క్యేజలాసాప్ ఇథైల్ 5 శాత౦ ద్రావకం ఎకరాకు 400 మి.లి చొప్పున ఏదొ ఒక దానిని 200 లిటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పీచికారి చేసి సమర్ధవ౦త౦గా కలుపుసు నివారిలచుకోవచ్చు