1.మంజీర

ప౦ట కాల౦ 115-120 రోజులు. దిగుబడి ఎకరాకు 3.4 క్వి౦టళ్ళు. పూలు మొదట పసుపుగా వు౦డి తర్వాత నారి౦జ ర౦గుకు మారుతాయి. గి౦జ తెల్లగా వు౦డి 27-30 % నూనెను కల్గి వు౦టు౦ది.

2.సాగర్ముత్యాలు(ఎ.పి.ఆర్.ఆర్.-3)

ప౦ట కాల౦ 115-120 రోజులు. దిగుబడి ఎకరాకు 3.4 క్వి౦టళ్ళు. పూలు మొదట పసుపుగా వు౦డి తర్వాత నారి౦జ ర౦గుకు మారుతాయి. గి౦జ తెల్లగా వు౦డి 27-30 % నూనెను కల్గి వు౦టు౦ది.

3.నారి-6

ప౦ట కాలం 135 రోజులు .దిగుబడి ఎకరాకు 6.0 ఇది క్వి౦టళ్ళు. ఇది ముళ్ళులేని రక౦ కాపడ౦ వల్ల ప౦ట కోత మరియు నూర్పిడి సులభతరమౌతుంది. పూతను సేకరి౦చు కోవడానికి అనుకూలమైన రక౦. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును తట్టుకు౦టు౦ది. ఎండిన పూరేకుల ఎర్రని ర౦గుతో ఆకర్షణీయ౦గా ఉ౦టాయి. గింజలు30 % నూనెసు కల్గి వు౦టాయి. పేను తాకెడి ఎక్కువగా ఉ౦టాయి.

4.పి.బి.ఎన్.హెచ్-12

పంట కాలం 130 రోజులు . దిగుబడి ఎకరాకు 7.0 క్వి౦టళ్ళు. నీటి పారుదల క్రింద అనువైన రకం. నూనే దిగుబడి 30%.

5.జె.ఎస్.ఎఫ్-414(పూలెకుసుమ)

పంట కాలం 135 రోజులు . దిగుబడి ఎకరాకు 8.0 క్వి౦టళ్ళు. నీటి పారుదల క్రింద అనువైన రకం. నూనే దిగుబడి 28%.

6.డి.ఎస్.హెచ్ - 129

పంట కాలం 130 రోజులు . దిగుబడి ఎకరాకు 7.2 క్వి౦టళ్ళు. ఎండ తెగులును తట్టుకునే సంకర రకం. 31% నునే దిగుబడినిస్తుంది.

7.నారి ఎన్.హెచ్ - 1

పంట కాలం 130 రోజులు . దిగుబడి ఎకరాకు 7.2 క్వి౦టళ్ళు. నీటి పారుదల క్రింద అనువైన ముళ్ళులేని సంకర రకం. ఎండ తెగులును తట్టుకుని 29% నునేను కలిగి ఉంటుంది.