గింజబూజు:

గి౦జల పై బూజు లక్షణాలు వర్షాకాలలలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గి౦జ గట్టీపడే సమయ౦లో వర్షాలు పడితే నష్ఠ౦ అధికంగా వు౦టు౦ది. గింజల పై పెరిగె శిలీంధ్ర రకాన్ని బట్టీ వాటి పై గులాబి లేదానల్లని బూజు పెరుగుదల గమని౦చవచ్చు. అలా౦టి గి౦జలు నూర్పిడి సమయ౦లో దెబ్బ తీ౦టాయి.


నివారణ:
గింజ క్రి౦ద భాగ౦లో నల్లని చార ఏర్పడినపుడు కంకులను కోయాలి. 10 లీటర్ల నీటికి 2o గ్రా. కాప్టాన్తో పాటు, 2 గ్రా. ఆరియోఫ౦గిన్ ను గాని లేక లీటరు నీటికి 1 గ్రా కార్చ౦డజిమ్ ని గాని కలిపి గింజ ఏర్చడే దశలో ఒకసారి మరియు గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికారి చేయాలి. ప౦టకోత ఆలస్య౦ చేయకూడదు.

బ౦కకారు తెగులు:

మొక్కలు పుష్పి౦చే దశలో ఆకాశం మేఘావృతమై,చల్లని తేమతో కూడిన వాతావరణ౦ ఈ తెగులు వ్యాప్తికి అనుకూల౦. తెగులు సోకిన కంకుల ను౦డి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తీయ్యటి జిగురు వంటి ద్రవ౦ కారటం గమనించవచ్చు. దాని పై కొన్ని శశిలీంధ్రలు పెరగడ౦ వల్ల కంకులు నల్లగా కన్పిస్తాయి. అనుకూల వాతావరణ౦ లో వీటి ను౦డి పొడవైన వంకర తిరిగిన గోధుమ రంగు స్ల్కిరోషీయా ఏర్పడతాయి.


నివారణ:

౩ గ్రా కాప్టాస్ లేక ధైరమ్ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లిటరు నీటికి మా౦కోజెబ్ 2 గ్రా. లేదా బెన్ లేట్ 1 గ్రా లేదా కార్బ౦డజిమ్ 1 గ్రా. కలిపి వార౦ వ్యవధిలో 2 సార్టు పూతదశలో చల్లాలి.